ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని హెచ్‌బీ కాలనీ చివరి బస్ స్టాప్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక గౌరవ కార్యదర్శి నరవ ప్రకాశ రావు మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.