విశాఖ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఘనంగా తులసి దళార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వైదికులు, పెద్ద సంఖ్యలో ఉభయదాతలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.