మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఉత్తమ ఆట తీరు కనబరిచి తన సత్తాను చాటిన యువ క్రికెటర్, విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని తుంగ్లాం గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అభినందనలు తెలిపారు. తనదైన శైలితో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని శనివారం పేర్కొన్నారు.