వైసీపీ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ చార్జీలు పెంచారని ఇప్పుడు మళీ వాళ్ళే నిరసనలు చేయటం దొంగే దొంగ అన్నట్టు ఉందని విశాఖజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి నేతలు ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలని అన్నారు.