విశాఖపట్నం రుషికొండ ఏ-1 గ్రాండ్ ది కన్వెన్షన్ హాల్‌లో శనివారం 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' పేరుతో జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విశాఖ జిల్లా అధ్యక్షులు కె. కె రాజు అధ్యక్షత వహించారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, విశాఖ జెడ్. పి. చైర్ పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.