విశాఖపట్నంలోని విమ్స్ ఆసుపత్రిలో రూ.48 లక్షల వ్యయంతో ఓ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. అలాగే సదరం స్లాట్‌ను కూడా శనివారం ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో సంస్థలు భాగస్వామ్యంగా ఉండాలన్నారు. డైరెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.