నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

63చూసినవారు
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన
ఏపీలో మండుటెండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో సేదతీరుతున్నారు. ద్రోణి ప్రభావంతో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి. జూన్ 12న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూల్, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్