విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మరోసారి సెల్‌ఫోన్ బయటపడటం సంచలనంగా మారింది. నర్మదా బ్లాక్ వద్ద శుక్రవారం అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సెల్‌ఫోన్ లభ్యమైంది. స్టోర్‌రూమ్ ఫ్లోరింగ్ మార్బుల్ కింద కీ ప్యాడ్ మొబైల్‌ను ప్యాక్‌చేసి పెట్టారు. తనిఖీల సందర్భంగా అధికారులకు అనుమానం రావడంతో ఆ ప్రాంతంలో తవ్వి చూడగా సెల్‌ఫోన్ బయటపడింది. తనిఖీల్లో భాగంగానే సెల్‌ఫోన్ గుర్తించామని ఎస్పీ మహేశ్‌బాబు తెలిపారు.