మల్కాపురం హైస్కూళ్లో చేరేందుకు పోటీ

68చూసినవారు
మల్కాపురం GVMC స్కూల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారని హెచ్‌.ఎమ్ ఎల్.అరుణకుమారి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం స్కూల్లో 1,040 మంది విద్యార్థులు ఉన్నారని, గత విద్యా సంవత్సరం పదో తరగతిలో 91% ఉత్తీర్ణత సాధించామని వెల్లడించారు. 589 మార్కులతో కొయినాడ రేఖ ప్రథమ స్థానం దక్కించుకోగా, 45 మంది 500కి పైగా మార్కులు పొందారన్నారు. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత తీర్చితే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

సంబంధిత పోస్ట్