నగరంలోని కాన్వెంట్ కూడలి రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ సమస్య నిత్య కృత్యంగా మారింది. ఈ ప్రాంతంలో ఎప్పట్నుంచో డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. చాలాసార్లు మరమ్మతులు చేసినప్పటికీ సమస్య మాత్రం శాశ్వతంగా పరిష్కారం కావడంలేదని స్థానికులు వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.