విశాఖ నగరంలో మంగళవారం ఉదయం మేఘావృతమై, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఇది ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులకు కొంత ఇబ్బందిగా మారింది. గత నాలుగు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో విసిగిన ప్రజలు, ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.