విశాఖలో మైనర్ బాలిక మిస్సింగ్ అయినా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక అదృశ్యమై 25 రోజులు గడుస్తున్న ఆచూకీ లభ్యం కాలేదంటూ కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం తల్లి కుటుంబసభ్యులు నల్ల రిబన్స్ కళ్ళకు కట్టుకొని ఆందోళ చేపట్టారు. తమ కూతురు తమకు కావాలంటూ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.