ఏపీలో జైళ్ల అభివృద్ధికి రూ.103 కోట్ల ప్రణాళికలు రూపొందించినట్టు జైళ్ల శాఖ ఐజీ డా. ఇండ్ల శ్రీనివాస్ ఆదివారం చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్‌ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అప్రూవల్‌కి పంపిందన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో 250 మందికి సరిపడే కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు.