విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో షిప్ యార్డ్ ఆల్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో షిప్ యార్డ్ గేటు వద్ద శుక్రవారం ఉదయం విశ్రాంతి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. షిప్యాడ్ సీనియర్ యూనియన్ నాయకులు యువిఎస్ఎన్ వర్మ కుమార్ మంగళం మాట్లాడుతూ.. హయ్యర్ పెన్షన్ కూడా అమలు కాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే షిప్ యార్డ్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని షిప్ యార్డ్ యాజమాన్యానికి డిమాండ్ చేశారు.