సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పాండిచ్చేరి హోం మంత్రి

80చూసినవారు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పాండిచ్చేరి హోం మంత్రి
పాండిచ్చేరి ప్రభుత్వ హోం, విద్యుత్ శాఖ మంత్రి ఎ. నమశ్శివాయం శుక్రవారం సింహాచలం వరహాలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ రాధ, పర్యవేక్షణ అధికారి జి వి ఎస్ కే ప్రసాద్ , పిఆర్ఓ నాయుడు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభo ఆలింగనము, బేడ మండపం ప్రదక్షిణ గావించారు. స్వామివారిని మంత్రి దర్శించుకున్న తర్వాత శేష వస్త్రంతో పండిత సత్కారం చేశారు.

సంబంధిత పోస్ట్