వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం సాయంత్రం విశాఖ ఓమోస్తరునుంచి భారీ వర్షం కురిసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కవ వర్షాలు కురిశాయని విశాఖలోని వాతావరణ కేంద్రం గురువారం బులిటెన్ విడుదల చేసింది. రానున‍్న 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తాయని అధికారులు తెలిపారు.