అప్పన్న సోదరి, ఏడు గ్రామాల ప్రజల ఇలవేల్పు, శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం నేత్ర పర్వంగా నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవం సందర్భంగా ఈవో త్రినాధరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వేకువ జామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి, భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.