అప్పన్న స్వామిని సౌత్ కోస్ట్ రైల్వే జిఎం సందీప్ మాతుర్ కుటుంబసభ్యులతో శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి స్వాగతం పలికి స్వామివారి దర్శనము గావించి అనంతరము వేదమంత్రాలతో వేద ఆశీర్వచనం, స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. సహాయ కార్యనిర్వహణ అధికారి పిల్లా శ్రీనివాసరావు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎవో అంకుష్ గుప్తా, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.