విశాఖ కేజీహెచ్ నూతన సూపరింటెండెంట్‌గా ప్రసూతి, స్త్రీల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐ. వాణి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం సాయంత్రం 4: 30 గంటలకు ఆమె ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ హెచ్‌ఓడి డాక్టర్ పి. శివానంద నుంచి బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ రోగుల సంరక్షణ, చికిత్స ప్రమాణాలను మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేజీహెచ్ ప్రతిష్టను మరింత పెంచడానికి సిబ్బంది అందరి సహకారం కోరారు.