విశాఖ‌: వందేభార‌త్‌కు అద‌న‌పు బోగీలు

0చూసినవారు
విశాఖ‌: వందేభార‌త్‌కు అద‌న‌పు బోగీలు
సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు శనివారం నుంచి అదనంగా నాలుగు బోగీలను జతచేసి మొత్తం 20 బోగీలతో నడపనున్న‌ట్టు విశాఖ‌లోని రైల్వే అధికారులు శుక్ర‌వారం తెలిపారు. ఇదివరకూ 16 బోగీలు (14 ఏసీ చైర్‌కార్‌, 2 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్) ఉన్న ఈ రైలుకు, ఇప్పుడు ఏసీ చైర్‌కార్ కోచ్‌ల సంఖ్యను 18కి పెంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో ఎలాంటి మార్పు ఉండదు.

సంబంధిత పోస్ట్