విశాఖ మీదుగా నడిచే 22831, 22832, 02863, 02864 రైళ్ల గమ్యస్థానాలు తాత్కాలికంగా యశ్వంతపూర్ బదులు యలహంకగా మార్చినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం తెలిపారు. ఈ రైళ్లు యలహంక వరకు మాత్రమే నడుస్తాయనీ, అక్కడినుంచి బయలుదేరుతాయనీ తెలిపారు. ఈ మార్పులు 12, 14, 19, 21, 26, 28 తేదీల్లో వర్తిస్తాయని ప్రయాణికులు గమనించాలని సోమవారం కోరారు.