ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. హరి హరనాధ శర్మ శుక్రవారం సింహాచలం అప్పన్న స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి సహాయ కార్య నిర్వహణా ధికారి వాడ్రేవు రమణమూర్తి పర్యవేక్షణ అధికారి జివివిఎస్కే ప్రసాద్ తదితరులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం అనంతరం బేడా మండపం ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు.