విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం పంచాయతీ అభివృద్ధి సూచికపై ఒకరోజు అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది. జెడ్. పి. పి. ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. నారాయణమూర్తి అధ్యక్షత వహించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, పంచాయతీ అభివృద్ధి సూచికలోని 22 సూచికలు, ముఖ్యంగా పీఏ1 లోని 9 థీమ్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన వివరించారు.