విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ సభ్వత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వైసీపీ సీనియర్ నేత, వైసీపీ మండల అధ్యక్షుడు బెహరా భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ అధినేతకు తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపారు. అదే లేఖను మీడియాకు సోమవారం విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, రాజీనామాను ఆమోదించాలని కోరారు.