ఉపరితల ఆవర్తనం కారణంగా అల్లూరి,అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ గురువారం ప్రకటించింది. అలాగే ఉష్ణోగ్రతలు 41-43°డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.