విశాఖ: అదుపుతప్పి పోలీస్ వాహనాన్ని ఢీకొన్న కారు

73చూసినవారు
విశాఖ: అదుపుతప్పి పోలీస్ వాహనాన్ని ఢీకొన్న కారు
విశాఖ పరిధిలోని సిరిపురం వద్ద గురువారం ఓ కారు అదుపుతప్పి పోలీస్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు, పోలీస్ వాహనమూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వేగంగా కారును ఆపకుండా వెళ్లిపోయాడు. దీనిని గమనించిన ఇద్దరు యువకులు ఆ కారును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు ఆ యువకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్