సీఎం చంద్రబాబు సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నారు. దీనిలో భాగంగా, విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్, ఆర్‌కె బీచ్, ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్, పీఎంపాలెం వరకు ఆదివారం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. సీపీ శంఖబ్రత బాగ్చీ, జాయింట్ కలెక్టర్ అశోక్ ఏర్పాట్లను పరిశీలించారు.