విశాఖ జిల్లా గోపాలపట్నంలోని
జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం ఇంద్ర నగర్ లో
జనసేన పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికులు ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడంతో స్థానికులు మంటలను ఆర్పేశారు. ఎమ్మెల్యే గణబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.