ఇన్ స్టాలో ఓ బాలిక పోస్టు చేసిన రీల్స్ కు లైక్ కొట్టి.. ఏకంగా ఆ బాలికనే రెండు మార్లు వివాహం చేసుకుని కటకటాల పాలైన ఘటన ఆదివారం విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది. నగరంలోని తాటిచెట్లపాలెం రెడ్డికి వీధికి చెందిన 15ఏళ్ల బాలికకు ిన్ స్టా రీల్స్ చేస్తుండేది. ఈక్రమంలో వారి ఇంటి సమీపంలో ఉన్న భార్గవ్ అనే యువకుడు తనకు రీల్స్ తయారు చేయడం నేర్పించాలని ఆ బాలికతో పరిచయం ఏర్పర్చుకుని ఏకంగా రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన బాలిక తల్లితండ్రులు ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.