విశాఖనగరంలో అంతరాష్ట్ర దొంగను పట్టుకుని చోరీ సొత్తుని స్వాధీనం చేశామని విశాఖ క్రైమ్ అడిషనల్ సీపీ మోహన్ రావు
బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే మధురానగర్ మాధవ టవర్స్ లో మార్చి 1 వ తేదీన జరిగిన చోరీలో హైదరాబాదుకు చెందిన తిప్పరాజు రామకృష్ణను అరెస్టు చేసామని తెలిపారు. అతని వద్ద నుంచి రూ. 3.70లక్షల నగదు స్వాధీనం చేసుకోగా మరో 13 తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉందన్నారు. అతనిపై ఇప్పటివరకు 79 కేసులు ఉన్నాయన్నారు.