విశాఖ: ఆన్ లైన్ బెట్టింగ్ కేసు.. ప్రధాన ముద్దాయి అరెస్ట్

81చూసినవారు
విశాఖ: ఆన్ లైన్ బెట్టింగ్ కేసు.. ప్రధాన ముద్దాయి అరెస్ట్
క్రికెట్, ఇతర బెట్టింగ్ లలో ఇటీవల అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా ప్రధాన ముద్దాయిని అరెస్టు చేశామని విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నగర సీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కాకినాడ వాసి అయిన చీకట్ల వెంకట మణిచంద్ ను మంగళవారం కాకినాడలోనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి ఒక కీ ప్యాడ్ ఫోన్, నాలుగు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్