విశాఖలోని జీవీఎంసీ 40వ వార్డు పరిధి ఏకేసి కాలనీ రామాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 1000 కమలాపువ్వులతో అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం పురవీధుల్లో స్వామివారి ఊరేగిస్తామని అర్చకుడు నరసింహమూర్తి శర్మ తెలిపారు.