విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యమని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన జీవీఎంసీ జోన్-3, వార్డు-27 లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగానున్న సాయి కృష్ణ పార్లర్ దుకాణంలో సే నో టు ప్లాస్టిక్ స్టిక్కర్ ను వార్డు కార్పొరేటర్ గొలగాని వీరారావు, జివిఎంసి అధికారులతో కలిసి అతికించి అందరికీ అవగాహన కల్పించారు.