జూన్ 21న విశాఖలో యోగా దినోత్సవం జరుగనుంది. ఇందులో పాల్గొనే ప్రజల కోసం 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే బస్సులు సచివాలయాలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. యోగాకు వచ్చే వారందరికీ ఉచితంగా టీషర్టులు, మ్యాట్లు అందజేస్తామన్నారు. తిరిగివెళ్లే సమయంలో అరటిపండు, కేక్, బిస్కెట్లు, పల్లి చిక్కీ, గ్లూకోజ్, నీటిబాటిల్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.