విశాఖలోని మారుతి కూడలి సమీపంలో లారీ ఢీకొని విపిన్ కుమార్ అనే యువకుడికి గాయాలయ్యాయి. కూర్మన్నపాలేనికి చెందిన ఇతను గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై నగరం నుంచి గాజువాక వైపు
వస్తుండగా లారీ ఢీకొట్టింది. దింతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా శుక్రవారం అతని
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.