పశ్చిమ విశాఖ జీవీఎంసీ పరిధిలో గల 7, 40, 58 నుండి 63 వార్డులో పని చేస్తున్న క్లాపవెన్ లోడర్స్ గా కార్మికులకు గత నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం పనులు బంద్ చేసి ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. జీతాలు రాకపోతే పండగకి పిల్లలతో పస్తులు ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ జీతాలు పడకపోతే రేపటి నుంచి పూర్తిగా పనులను నిలిపివేస్తామని హెచ్చరించారు.