అచ్యుతాపురం - అనకాపల్లి రహదారిలో సోమవారం రాత్రి మర్రిచెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చెట్టును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు జేసీబీ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.