పరవాడ టాగూర్ ఫార్మా పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 40 లక్షల పరిహారం ప్రకటించడం అన్యాయమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము అన్నారు. అచ్యుతాపురంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు.