అచ్యుతాపురంలో అక్రమంగా పరిశ్రమను మూసివేసిన లలిత ఫెర్రో యాజమాన్యం కార్మికులు ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆందోళన నిర్వహించారు. బుధవారం పరిశ్రమ గేటు వద్ద కార్మికులు నిర్వహించిన ఆందోళనకు సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము మద్దతు తెలిపారు. చట్ట విరుద్ధంగా పరిశ్రమను మూసివేసి కార్మికులకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలన్నారు.