వంద రూపాయలు కోసం హత్యాయత్నం

76చూసినవారు
వంద రూపాయలు కోసం హత్యాయత్నం
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కొత్తల గ్రామంలో 100 రూపాయల కోసం మిత్రుడు పీక కోసాడు ఓ వ్యక్తి. మద్యం కోసం ఇచ్చిన 100 రూపాయలు తిరిగి చెల్లించకపోవడంతో ఆగ్రహంతో బ్లేడ్ తో గురువారం పీక కోసిన నిందితునిపై ఎలమంచిలి గ్రామీణ పోలీసులు హత్య యత్నం కేసు నమోదు చేశారు. నిందితుడి పై గతంలో ఫోక్సో కేసు నమోదు అయిందన్నారు. ఈ కేసులో బాధితుడు నిందితుడు ఇద్దరు మిత్రులే. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారేనని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్