అచ్యుతాపురం గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా క్రాఫ్ట్ వర్క్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్రాఫ్ట్ ట్రైనర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు క్రాఫ్ట్ వర్క్ దోహదపడుతుందన్నారు. గ్రంధాలయాధికారి మాట్లాడుతూ వివిధ పోటీల్లో గెలిచిన విజేతలకు 7న బహుమతులు అందిస్తామని చెప్పారు.