విశాఖ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటశేషమ్మ గురువారం చోడవరం సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ జైలు ప్రాంగణాన్ని పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ జైల్లో ఉన్న ముద్దాయిలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి పలు సూచనలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ సెంట్రల్ జైలర్ రాము, ప్యానల్ అడ్వకేట్ బి రాజు తదితరులు పాల్గొన్నారు.