యలమంచిలి సమగ్ర అభివృద్ధికి అవసరమైన నివేదిక తన దగ్గర ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. సోమవారం యలమంచిలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ పిల్లా రమాకుమారి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ యలమంచిలి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.