యలమంచిలి పట్టణం తులసి నగర్ ప్రాంతంలో మరమ్మతులకు గురైన తాగునీటి బోర్కు యుద్ధప్రాతిపదికన బుధవారం మరమ్మతులు చేపట్టినట్లు మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ ఏఈ గణపతిరావు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటికి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాగునీటికి సంబంధించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.