కర్మాగారాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఏపీఐఐసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సుమారు ఇరవైవేల ఎకరాల్లో ఏపీఐఐసీ కర్మాగారాలు నిర్మించినా, స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించలేదన్నారు. నూతన కంపెనీలు పూర్తిస్థాయి మద్దతు అందిస్తానన్నారు.