అచ్యుతాపురం గాజువాక బైపాస్ రోడ్ లో వెంకటాపురం జంక్షన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు రాంబిల్లి నావెల్ బేస్ కి భారీ కంకర తీసుకెళ్తున్న లారీ క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే మంటలు గమనించి లారీ ఆపి, బయటికి వచ్చాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.