భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఏఐటీయూసీ

84చూసినవారు
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి  : ఏఐటీయూసీ
రాష్ట్రంలో ఉన్న లక్షల భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు గనిశెట్టి ఏసుదాసు డిమాండ్ చేశారు. గురువారం ఎలమంచిలి లో భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని కార్మికుల క్లైములు పెండింగ్లో ఉన్నాయని కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల సమస్యలకు పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు. ఏ. శంకర్రావు, ఎం. జై కృష్ణ, లావరాజు, ఎస్. గణేషు, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్