అచ్యుతాపురం పంచాయతీలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న గురువారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచ్ కె విమల నాయుడు ద్వారపురెడ్డి బాజ్జి చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా దుప్పట్లు అందజేశారు. ఉప్పవరం పంచాయతీలో మాజీ సైనికులకు గ్రామ సర్పంచ్ సకల ఉమామహేశ్వరి, ఉప సర్పంచ్ కూనిశెట్టి సత్తిబాబు సన్మానం చేశారు. మల్లవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ పి. వాసు రాజు చేతులమీదుగా పలువురుని సన్మానం చేశారు.