హుకుంపేట మండలంలోని భారీ వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షంతో ఉపశమనం లభించింది. దీంతో వాహన చోదకులు గంటల పాటు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కురిసిన కుండపోత వర్షంతో వాగులు వంకలు చెరువులు పంట పొలాలు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో మట్టి రోడ్లు బురదమయమయ్యాయి.