భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు బాలాజీ, రమణ ఆధ్వర్యంలో యలమంచిలి కొత్తపేట హైస్కూల్లో 10తరగతి విద్యార్థులకు ఆదివారం నమూనా పరీక్ష నిర్వహించారు. సుమారు 14 స్కూల్స్ నుండి 800 వరకు విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షల పట్ల అవగాహన కల్పించడానికే ఈ పరీక్ష విద్యార్దులకు ఉపయోగపడుతుందని పాఠశాల ఉపాధ్యాయులు ఎం. సుధారాణి అన్నారు. అభి, మణికంఠ, రామలక్ష్మణులు, శ్రీను, కృప, పాల్గొన్నారు.